ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 02:39:36

శ్రీనిఖ శెభాష్‌

శ్రీనిఖ శెభాష్‌

ఆర్మూర్‌, జనవరి 4: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన నిజామాబాద్‌కు చెందిన మద్దుల శ్రీనిఖను ఎమ్మెల్సీ కవిత సోమవారం అభినందించారు. గత సెప్టెంబర్‌లో జరిగిన పీఎం ఆన్‌లైన్‌ తైక్వాండో పోటీల్లో(అండర్‌-11) శ్రీనిఖ పసిడి పతకంతో మెరిసింది. భవిష్యత్‌లో మరింతగా రాణించి రాష్ర్టానికి పేరు తీసుకురావాలని కవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జాతీయ ఆర్చరీ ప్లేయర్‌ మురళి, కోచ్‌ హీరాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo