హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరిగిన కళింగ సూపర్ కప్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ 4-1తేడాతో హైదరాబాద్ ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. టోర్నీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన శ్రీనిధి..హైదరాబాద్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. శ్రీనిధి తరఫున ఇబ్రహీం సిస్కో, ఎలీ సబియా,లాల్రోమోవియా, కీన్ లెవిస్ గోల్స్ చేశారు.