హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ నుంచి మరో క్రీడాతార తళుక్కున మెరిసింది. నేవి ముంబై వేదికగా జరిగిన ఏఐటీఏ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీమన్యారెడ్డి రెండు టైటిళ్లతో మెరిసింది. టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన జోరును కొనసాగిస్తూ సింగిల్స్‌లోనూ విజేతగా నిలిచింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీమన్యారెడ్డి 3-6, 6-4, 6-1తో డానికా ఫెర్నాండోపై అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థికి తొలి సెట్ చేజార్చుకున్న శ్రీమన్య..పుంజుకుని పోటీలోకి వచ్చింది. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో మ్యాచ్‌ను తన వశం చేసుకుంది.