టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 లో ఈ రోజు ఇంగ్లండ్, శ్రీలంక మధ్య పోరు జరగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ ముందు బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆత్మవిశ్వాసంలో ఇంగ్లండ్ ఉండగా.. ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన శ్రీలంకకు ఈ మ్యాచ్ గెలుపు చాలా అవసరం.
శ్రీలంక టీమ్‌లో ఎటువంటి మార్పు లేదు. పాథుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), చరిత్ అసలంక, ధనంజయ డీసిల్వా, భానుక రాజపక్సా, డాసన్ షనక(కెప్టెన్), చమిక కరునారత్నె, వానిండు హసరంగ, దుష్మంత చమీరా, మహీశ్ తీక్షన, లహిరు కుమారా బరిలో ఉన్నారు.
ఇంగ్లండ్ టీమ్ నుంచి జసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలాన్, జానీ బైర్‌స్టో, మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టన్, మోయిన్ అలీ, క్రిస్ వోకెస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషిద్, టైమిల్ మిల్స్ బరిలో ఉన్నారు.
ఈ మ్యాచ్ శ్రీలంకకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలవకపోతే.. సెమీస్ ఆశలను శ్రీలంక వదిలేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కేవలం ఒకే మ్యాచ్ గెలిచిన శ్రీలంక గ్రూప్ 1లో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. కేవలం 2 పాయింట్లు మాత్రమే వచ్చాయి. అలాగే నెట్ రన్ రేట్ కూడా నెగెటివ్‌లో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి.. ఐదో మ్యాచ్ వెస్టిండీస్‌పై కూడా గెలిచి ఎక్కువ నెట్ రన్ రేట్ సాధిస్తే.. శ్రీలంకకు సెమీస్ అవకాశాలు ఉండే చాన్స్ ఉంది.
Toss news from Sharjah 🪙
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Sri Lanka have won the toss and elected to field.
Who are you backing in this one? #T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo pic.twitter.com/33htGzLuGa