టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు శ్రీలంక 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు.. తమ బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. శ్రీలంకను ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు ఆదుకున్నారు. దీంతో స్కోర్ పెరిగింది.
చరిత్ అసలంక.. 27 బంతుల్లో 35 పరుగులు చేయగా.. కుశాల్ పెరీరా 25 బంతుల్లో 35 పరుగులు, భానుక రాజపక్స 26 బంతుల్లో 33 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. కమిన్స్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు, ఆడమ్ జంపా.. 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
Mitchell Starc at his blazing best 🔥
— T20 World Cup (@T20WorldCup) October 28, 2021
An electrifying yorker gets the better of Kusal Perera, bringing an end to his knock of 35. #T20WorldCup | #AUSvSL | https://t.co/dkIIjDEJLc pic.twitter.com/XvoeDDOHq9
Australia have been set a target of 155 🎯
— ICC (@ICC) October 28, 2021
Can the Sri Lankan bowlers defend this?
#T20WorldCup | #AUSvSL | https://t.co/amKqUyfDGR pic.twitter.com/GN7vVwXqzI