గీలాంగ్: టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 స్టేజ్‌కు శ్రీలంక క్వాలిఫై అయ్యింది. ఇవాళ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 రన్స్ తేడాతో నెగ్గిన శ్రీలంక తర్వాత రౌండ్లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో .. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. లంక బ్యాటర్ మెండిస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను అత్యధికంగా 79 రన్స్ చేశాడు. కుశాల్ మెండిస్ కేవలం 44 బంతుల్లో 79 రన్స్ చేసి నెదర్లాండ్స్‌కు మంచి టార్గెట్ ఇచ్చారు.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభం సరిగా జరగలేదు. కానీ ఆ జట్టు ఓపెనర్ మాక్ ఓ డౌడ్ మాత్రం పరుగుల వేట కొనసాగించాడు. ఓ డౌడ్ 71 రన్స్ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నమీబియా, యూఏఈ మ్యాచ్ ఫలితంపై నెదర్లాండ్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నమీబియాపై యూఏఈ గెలిస్తే, అప్పుడు ఆ గ్రూపు నుంచి నెదర్లాండ్స్ తర్వాత రౌండ్లోకి ప్రవేశిస్తుంది.
స్కోరు బోర్డు
శ్రీలంక 162-6 (మెండిస్ 79, అసలంక 31, వాన్ మీకరన్ 2-25, డీ లీడ్ 2-31)
నెదర్లాండ్స్ 146-9 (ఓ డౌడ్ 71, ఎడ్వర్డ్స్ 21, హసరంగ 3-28, తీక్షణ 2-32)