యాచారం, ఆగస్టు 30: 58వ జాతీయ స్థాయి అండర్-19 రోప్ స్కిప్పింగ్లో మారుమూల గిరిజన తండాకు చెందిన అక్కా చెల్లెళ్ళు శ్రీబిందు, శ్రీసింధు సత్తా చాటారు. 25 రాష్ర్టాలు పోటిపడిన చాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొంది జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కేసీతండాకు అనుబంధంగా ఉన్న మంథన్గౌడ్ (మీసాలతండా)కు చెందిన నేనావత్ జైపాల్నాయక్, జ్యోతి దంపతుల కుమార్తెలు శ్రీబిందు, శ్రీసింధు 10వ తరగతి చదువుతున్నారు. శనివారం రాష్ట్ర క్రీడాశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్ చైర్మెన్ శివసేనారెడ్డి.. శ్రీబిందు, శ్రీసింధులను ప్రత్యేకంగా అభినందించారు.