RR vs SRH : పంతొమ్మిదో సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యే జట్టేదో మరికొన్ని గంటల్లో తెలియనుంది. క్వాలిఫయర్ 2 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ముల్లన్‌పూర్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వికెట్ ఛేదనకు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్యాటీ చెప్పాడు. పరాగ్ తమ ఫైనల్ పదకొండు మందిలో జడేజా ఉన్నాడని.. శుభం దూబే ఇంప్యాక్ట్ సబ్‌గా ఆడుతాడని వెల్లడించాడు.
క్వాలిఫయర్ 1లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టే జట్టేదో ఎలిమినేటర్ ఫలితంతో తేలిపోనుంది. లీగ్ దశలో చెరొక విజయంతో ఆత్మవిశ్వాసంగా ఉన్న రాజస్థాన్, సన్‌రైజర్స్ ముల్లన్‌పూర్‌లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. జైపూర్‌లో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఉతికేస్తూ శతకం బాదిన వైభవ్ సూర్యవంశీ వికెట్ కీలకం కానుంది. మ్యాచ్‌కు ముందు వైభవ్ వికెట్ కోసం తమ వద్ద ప్లాన్ ఏ, బీ, సీ ఉన్నాయని కమిన్స్ చెప్పాడు. అయితే.. ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మలతో బౌలింగ్ పరంగా కాస్త మెరుగ్గా కనిపిస్తున్న రాజస్థాన్.. భారీ స్కోర్ కొడితేనే సన్‌రైజర్స్ వైల్డ్ ఫైర్ ఆటను అడ్డుకోగలదు.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to field against @rajasthanroyals
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/qG9Ieb5FWG
— IndianPremierLeague (@IPL) May 27, 2026
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), క్లాసెన్, స్మరణ్ రవిచంద్రన్, నితీశ్ రెడ్డి, కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, షకీబుల్ హసన్, ప్రఫుల్ హింగే.
ఇంప్యాక్ట్ సబ్స్ – సలీల్ అరోరా, అనికేత్ వర్మ, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్(వికెట్ కీపర్), పరాగ్(కెప్టెన్), ఫెరీరా, శనక, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ సింగ్ పంజా.
ఇంప్యాక్ట్ సబ్స్ – శుభం దూబే, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్, అమన్ రావు పెరాల, తుషార్ దేశ్‌పాండే.