సన్‌రైజర్స్ తమ బౌలింగ్ బలం చూపిస్తోంది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పవర్‌ప్లే ఓవర్లలోనే సత్తా చాటి రెండు వికెట్లు తీయగా.. మరో ఆల్‌రౌండర్ షెఫర్డ్ కూడా బంతి అందుకున్న తొలి ఓవర్లోనే మనీష్ పాండే (11)ను పెవిలియన్ చేర్చాడు. లూయిస్ (1) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన పాండే.. వచ్చీ రావడంతోనే భారీ షాట్లు ఆడాడు.
ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 11 పరుగులు చేసిన అతను.. ఆ మరుసటి బంతికే భువనేశ్వర్ కుమార్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో జట్టు 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో కెప్టెన్ కేఎల్ రాహుల్ (17 నాటౌట్) ఉండటంతో లక్నో అభిమానులు ఇంకా భారీ స్కోరుపై ఆశలు పెట్టుకొని ఉంటారు.