సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా కొట్టిన బంతి నేరుగా వెళ్లి కెమెరా అద్దం పగలగొట్టింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా 116 పరుగుల లక్ష్య ఛేదనలో నితీష్ రాణా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 25 పరుగులు చేసి అమూల్యమైన పరుగులు సమకూర్చాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే కేకేఆర్ జట్టు విజయం సాధించింది.
ఈ క్రమంలో కేకేఆర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఒక వింత ఘటన జరిగింది. జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని రాణా బౌండరీకి తరలించాడు. డీప్ మిడ్ వికెట్ దిశగా వెళ్లిన ఈ బంతిని ఆపడానికి ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బంతి నేరుగా వెళ్లి కెమెరాకు తగిలి అద్దం పగలగొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు కేకేఆర్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా జట్టు లక్ష్యఛేదనలో ఆచితూచి ఆడింది. 19.4 ఓవర్లలో 119 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది.