IPL 2023 | మా కెప్టెన్ ఒక మెషిన్.. అతనొక అద్భుతమైన క్రికెటర్ : మయాంక్ అగర్వాల్
IPL 2023 : పదిహేనేళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్‌కు వినోదం పంచిన ఐపీఎల్ పండుగ రేపటితో షురూ కానుంది. ఈ ఏడాది టైటిల్ సాధించడమే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ మయాంక్ ఆగర్వాల్(Mayank Agarwal) కెప్టెన్ ఎయిడెన్ మర్క్రమ్(Aiden Markram)పై ఆసక్తికర కామెంట్లు చేశాడు.
IPL 2023 : పదిహేనేళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్‌కు వినోదం పంచిన ఐపీఎల్ (IPL 2023) పండుగ రేపటితో షురూ కానుంది. ఈ ఏడాది టైటిల్ సాధించడమే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ మయాంక్ ఆగర్వాల్(Mayank Agarwal) కెప్టెన్ ఎయిడెన్ మర్క్రమ్(Aiden Markram)పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. అతనొక మెషిన్, అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసలు కురిపించాడు. ఎస్ఆర్హెచ్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘మర్క్రమ్ అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు అతనొక మెషిన్. ఎందుకంటే..? అతను గేమ్ కోసం చాలా కష్టపడతాడు. అంతేకాదు తన ఆటను మెరుగుపరుచుకునేందుకు బాగా ఆలోచిస్తాడు.
అంతేకాదు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతని కెప్టెన్సీలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మయాంక్ తెలిపాడు. మర్క్రమ్, అతను ఇంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు కలిసి ఆడామని మయాంక్ గుర్తు చేసుకున్నాడు. గత సీజన్లో ఈ ఓపెనర్ పంబాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.
యువకులతో పటిష్టంగా
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మునపటికంటే ఈసారి పటిష్టంగా కనిపిస్తోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికా లీగ్‌లో(SAT20) సన్‌రైజర్స్ ఈస్టర్స్ కేప్ జట్టును చాంపియన్‌గా నిలిపిన మర్క్రమ్ సారథిగా టీమ్‌ను నడిపించనున్నాడు. హ్యారీ బ్రూక్(Harry Brook), మయాంక్ అగర్వాల్, గ్లెన్ ఫిలిఫ్స్, క్లాసిన్ వంటి విధ్వంసక ఆటగాళ్లు మిడిలార్డర్లో కీలకం కానున్నారు. సీనియర్ భువనేశ్వర్ కుమా(Bhuvaneshwar Kumar), నటరాజన్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగిలతో బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. హెడ్‌కోచ్ బ్రియాన్ లారా, బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ సలహాలతో ఈ సీజన్లో చెలరేగాలని భావిస్తోంది. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో ట్రోఫీ నెగ్గిన ఎస్ ఆర్‌హెచ్ ఈసీజన్లో టైటిల్‌పై కన్నేసింది. 16వ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఏప్రిల్ 2న గత సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది.
రష్మిక, తమన్న సందడి
ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా, కన్నులపండువగా జరగనున్నాయి. అందుకని సినీ సెలబ్రిటీలు, బాలీవుడ్ సింగర్స్‌తో బీసీసీఐ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. తెలుగు, కన్నడతో పాటు బాలీవుడ్‌లోనూ పాపులర్ అయిన రష్మిక మందాన(Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia,) డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
“IPL 2023 | రేపటితో ఐపీఎల్ 16వ సీజన్ షురూ.. ట్రోఫీతో పోజిచ్చిన 10 జట్ల కెప్టెన్లు”
“Mumbai Indians: ముంబై ఇండియన్స్ అఫీషియల్ పార్ట్నర్గా రిలయన్స్ డిజిటల్”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

