ఈ ఐపీఎల్ సీజన్‌ను ఘోర ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే చెన్నైపై భారీ విజయం సాధించి ఊపుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. పూణేలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
చాలా మ్యాచుల్లోలాగే పిచ్ నుంచి ఆరంభంలో లభించే సహకరానాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నామని, అలాగే తర్వాత మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని విలియమ్సన్ చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయి, ఆవేశ్ ఖాన్.
#SRH have won the toss and will bowl first against #LSG.
Live – https://t.co/89IMzVlZVN #SRHvLSG #TATAIPL pic.twitter.com/ZDxKAoqCeN
— IndianPremierLeague (@IPL) April 4, 2022