Nandini Agasara | హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంచకుల(హర్యానా) వేదికగా జరుగుతున్న 63వ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని పసిడి పతకంతో మెరిసింది.
ఆదివారం జరిగిన మహిళల ఫెప్టాథ్లాన్ ఈవెంట్లో బరిలోకి దిగిన నందిని 5806 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ నందిని మొత్తం ఏడు ఈవెంట్లలో సత్తాచాటింది. 100మీటర్ల హర్డిల్స్ రేసును 13.93 సెకన్లలో, హైజంప్‌లో 1.64మీటర్లు, షాట్‌పుట్‌లో 14.56 మీటర్ల నందిని స్వర్ణం సాధించింది.