CPL | గయానా: ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్నా ఇప్పటివరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఐపీఎల్‌తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లోనూ పంజాబ్‌కు ఫ్రాంచైజీ ఉన్నా ఈ రెండు లీగ్‌లలో ఇప్పటిదాకా ఆ జట్టు టైటిల్ నెగ్గలేదు. కానీ ఎట్టకేలకు ఆ ఫ్రాంచైజీ కోరిక నెరవేరింది. ఆదివారం ముగిసిన సీపీఎల్ ఫైనల్లో సెయింట్ లూసియా కింగ్స్.. 6 వికెట్ల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
సెయింట్ లూసియాకు బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గయానా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని సెయింట్ లూసి యా.. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆరోన్ జోన్స్ (48 నాటౌట్), రోస్టన్ చేజ్ (39 నాటౌట్) రాణించారు. చేజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, నూర్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించాయి.