
ప్రేమికులారా పసందైన విందుకు సిద్ధమైపోండి. ప్రపంచాన్నంతా ఏకం చేసేలా కండ్లు మిరుమిట్లు గొలిపే క్రీడా సంబురాలకు వేళైంది. ఒళ్లంతా కండ్లు చేసుకుని వీక్షించే సమయం రానే వచ్చింది. విశ్వక్రీడలను తలపించే కామన్వెల్త్, ఆసియా గేమ్స్, వింటర్ ఒలింపిక్స్ పోటీలకు సమయమైంది. ఈ మెగా టోర్నీలకు తోడు అభిమానులకు మంచి కిక్కిచ్చే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఖతార్ వేదికగా అలరించబోతుండగా, మహిళామణుల వన్డే పోరు, యంగ్ తరంగ్‌ల వరల్డ్‌కప్ వార్, పొట్టి ప్రపంచకప్ పోరు, ఐపీఎల్‌తో ఈ ఏడాది మహా రంజుగా సాగనుంది. ఇవి ఇలా ఉంటే రోమాలు నిక్కబొడిచే ఫార్ములావన్ రేసులు, కండ్లప్పగించి చూసే టెన్నిస్, బ్యాడ్మింటన్ సమరాలకు ఫ్యాన్స్ ఫిదా కావడం ఖాయంగా కనిపిస్తున్నది. నువ్వా నేనా అన్నట్లు సాగే బాక్సింగ్, రెజ్లింగ్ లాంటి ముఖాముఖి
పోరాటాలు రోమాంచితంగా సాగనున్నాయి. మొత్తంగా 2022 ఏడాది క్రీడాభిమానులకు పండుగే పండుగ అని చెప్పొచ్చు. మరింకెందుకు ఆలస్యం ఆయా టోర్నీల షెడ్యూల్‌పై ఒక లుక్కెద్దాం పదండి..
కామన్వెల్త్ గేమ్స్ (బర్మింగ్‌హామ్)28 జూలై-8 ఆగస్టు
ఆసియా గేమ్స్ (హంగ్జు) 10సెప్టెంబర్-25 సెప్టెంబర్
ఫిఫా ప్రపంచకప్ (ఖతార్)21 నవంబర్-18 డిసెంబర్
వింటర్ ఒలింపిక్స్ (బీజింగ్)4 ఫిబ్రవరి- 20 ఫిబ్రవరి
మహిళల వన్డే ప్రపంచకప్ (న్యూజిలాండ్)4 మార్చి-3 ఏప్రిల్
టీ20 ప్రపంచకప్ (ఆస్ట్రేలియా)16అక్టోబర్-13 నవంబర్
ఐసీసీఅండర్-19 ప్రపంచకప్ (వెస్టిండీస్)14 జనవరి-5 ఫిబ్రవరి
ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 17-30
ఫ్రెంచ్ ఓపెన్ మే 22-5 జూన్
వింబుల్డన్ 27 జూన్-10 జూలై
యూఎస్ ఓపెన్ 29 ఆగస్టు-11 సెప్టెంబర్
ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీజూలై 15-24 అండర్-20 ప్రపంచ
అథ్లెటిక్స్ టోర్నీ ఆగస్టు 2-7
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్టోర్నీఫిబ్రవరి 11-13
నేషనల్ అథ్లెటిక్స్ టోర్నీ జనవరి 27-29
ఇండియా ఓపెన్:జనవరి 11-16
సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీ: జనవరి 18-23
స్పెయిన్ మాస్టర్స్:మార్చి 1-6
ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్: మార్చి 16-20
స్విస్ ఓపెన్: మార్చి 22-27
థాయ్‌లాండ్ ఓపెన్: మే 17-22
ఇండోనేషియా మాస్టర్స్:జూన్ 7-12
ఇండోనేషియా ఓపెన్:జూన్ 14-19
మలేషియా ఓపెన్: జూన్ 28-జూలై 3
సింగపూర్ ఓపెన్: జూలై 11-14
ప్రపంచ చాంపియన్‌షిప్: ఆగస్టు 21-28
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్: అక్టోబర్ 24-30
వరల్డ్ టూర్ ఫైనల్స్: డిసెంబర్ 14-18
మహిళల ఆసియా కప్ జనవరి 21-28
ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్(మహిళల) జనవరి 31-జూన్ 19
హాకీ ప్రొ లీగ్(పురుషుల) ఫిబ్రవరి 5-జూన్ 19
మహిళల ప్రపంచకప్ జూలై 1-17
హాకీ ఇండియా సీనియర్ పురుషుల టోర్నీఏప్రిల్ 6-17
మహిళల టోర్నీఏప్రిల్ 22-మే 3
కోపా అమెరికాకప్ జూలై 8-30
ఫిఫా వరల్డ్ కప్ ఫిబ్రవరి -3-12
ఫిఫా అండర్-20 మహిళల ప్రపంచకప్ ఆగస్టు 10-28
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్(భారత్) అక్టోబర్ 11-30
ఫిఫా మహిళల ప్రపంచకప్ జూలై 20-ఆగస్టు 20
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్: జనవరి 3-15
వన్డే సిరీస్: జనవరి 19-23
స్వదేశంలో.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు : ఫిబ్రవరి 6-20
శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్‌లు: మార్చి 5-18
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్: జూన్ 9-19
ఇంగ్లండ్ పర్యటన
ఏకైక టెస్టు, టీ20, వన్డే సిరీస్: జూలై 1-17
ఆసియా కప్: సెప్టెంబర్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్:
సెప్టెంబర్-నవంబర్‌లో(4 టెస్టులు, 3 టీ20లు)