కొత్త సంవత్సరంలో క్రీడాభిమానులకు సరికొత్త మజా పంచేందుకు మెగాటోర్నీలు స్వాగతం పలుకుతున్నాయి. నిరుడు సాకర్ మాయలో మునిగి తేలిన ప్రేక్షకులు ఈసారి క్రికెట్ జపం చేయనున్నారు. భారత్ వేదికగా.. ఈ ఏడు వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఆసియా క్రీడలకు చైనాలోని హాంగ్జ్జు నగరం ఆతిథ్యమివ్వనుంది.
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు ఢిల్లీ వేదిక కానుండగా.. భువనేశ్వర్‌లో హాకీ ప్రపంచకప్ జరుగనుంది. నిరుడు యావత్ ప్రపంచాన్ని పురుషుల ఫిఫా ప్రపంచకప్ ఉర్రూతలూగిస్తే.. ఈ ఏడు మహిళల మెగాటోర్నీ జరుగనుంది. ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 బాలికల ప్రపంచకప్‌తో పాటు మహిళల టీ20 ప్రపంచకప్ అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఎప్పటిలాగే ఐపీఎల్, ఐఎస్ఎల్, పీకేఎల్ ఎలాగూ ఉండనే ఉన్నాయి.
దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వీధుల్లో ఫార్ములా-ఈ రేసు జరుగనుండగా.. అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా-1 రేసులు అలరించనున్నాయి. టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు, బ్యాడ్మింటన్ టోర్నీలు, బాక్సింగ్, రెజ్లింగ్ ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో మరెన్నో టోర్నీలు రెడీగా ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం వాటి షెడ్యూల్‌పై ఓ కన్నేద్దం పదండి..
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ : మార్చి15-31
హాకీ పురుషుల ప్రపంచకప్
13 జనవరి-
29 జనవరి
భువనేశ్వర్
ఫార్ములా-ఈ రేస్
ఫిబ్రవరి 10-11 హైదరాబాద్
ఆసియా గేమ్స్
23 సెప్టెంబర్ -8 అక్టోబర్
హాంగ్జు
క్రికెట్
శ్రీలంకతో టీ20 సిరీస్ : జనవరి 3-7
శ్రీలంకతో వన్డే సిరీస్ : జనవరి 10-15
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ : జనవరి 18-24
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ : జనవరి 27-ఫిబ్రవరి 1
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ : ఫిబ్రవరి 9-మార్చి 13
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ : మార్చి 17-22
వెస్టిండీస్ పర్యటన : జూలై-ఆగస్టు
(2, టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు)
ఆసియాకప్ : సెప్టెంబర్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ : సెప్టెంబర్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నవంబర్-డిసెంబర్
పురుషుల వన్డే ప్రపంచకప్
వేదిక: భారత్ : అక్టోబర్-నవంబర్
మహిళల టీ20 ప్రంపచకప్
వేదిక: దక్షిణాఫ్రికా : 10 ఫిబ్రవరి- 26 ఫిబ్రవరి
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్
వేదిక: దక్షిణాఫ్రికా : 14 జనవరి-29 జనవరి
ఐపీఎల్-14 :20 మార్చి-1 జూన్
పీకేఎల్-10 :7 అక్టోబర్ నుంచి
ఐఎస్ఎల్ : అక్టోబర్ నుంచి
ఫార్ములా వన్ గ్రాండ్‌ప్రి
బహ్రెయిన్ మార్చి 5 : ఆస్ట్రియా జూలై 2
సౌదీ అరేబియా మార్చి 19 : యూనైటెడ్ కింగ్డమ్ జూలై 9
ఆస్ట్రేలియా ఏప్రిల్ 2 : సింగపూర్ సెప్టెంబర్ 17
అజర్బైజాన్ ఏప్రిల్ 30 : జపాన్ సెప్టెంబర్ 24
మియామి మార్చి 7 :ఖతార్ అక్టోబర్ 8
మొనాకో మే 28 :అమెరికా అక్టోబర్ 22
స్పెయిన్ జూన్ 4 :బ్రెజిల్ నవంబర్ 5
కెనడా జూన్ 18 :అబుదాబి నవంబర్ 26
టెన్నిస్
ఆస్ట్రేలియన్ ఓపెన్
16 జనవరి-29 జనవరి
ఫ్రెంచ్ ఓపెన్ 28 మే-11జూన్
వింబుల్డన్ 3 జూలై-16 జూలై
యూఎస్ ఓపెన్
28 ఆగస్టు-10 సెప్టెంబర్
అథ్లెటిక్స్
జాతీయ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ :జనవరి 7-8
జాతీయ అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ మీట్ :జనవరి 12-14
జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్:షిప్ మార్చి 10-12
ఇండియన్ గ్రాండ్‌ప్రి-1 :మార్చి 20
ఇండియన్ గ్రాండ్‌ప్రి-2 :మార్చి 27
ఇండియన్ గ్రాండ్‌ప్రి-3 :ఏప్రిల్ 2
ఇండియన్ గ్రాండ్‌ప్రి-4 :ఏప్రిల్ 10
నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్
చాంపియన్‌షిప్ :అక్టోబర్ 11-14
బ్యాడ్మింటన్
ఇండియా ఓపెన్ :జనవరి 17-22
ఇండోనేషియా మాస్టర్స్ :జనవరి 24-29
జర్మన్ ఓపెన్ :మార్చి 7-12
ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్ :మార్చి 14-19
స్విస్ ఓపెన్ : మార్చి 21-26
స్పెయిన్ మాస్టర్స్ :మార్చి 28-ఏప్రిల్ 2
ఏషియన్ చాంపియన్‌షిప్ :ఏప్రిల్ 25-30
మలేషియా మాస్టర్స్ :మే 23-28
థాయ్‌లాండ్ ఓపెన్న :మే 30-జూన్ 4
సింగపూర్ ఓపె :జూన్ 6-11
డెన్మార్క్ మాస్టర్స్ :జూన్ 8-11
ఇండోనేషియా ఓపెన్ :జూన్ 13-18
చైనా ఇంటర్నేషనల్ చాలెంజ్ :జూన్ 20-25
కొరియా ఓపెన్ :జూలై 18-23
జపాన్ ఓపెన్ :జూలై 25-30
ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ :ఆగస్టు 22-27
చైనా ఓపెన్ : సెప్టెంబర్ 5-10
ఇండోనేషియా సూపర్-100 :సెప్టెంబర్ 5-10
హాంకాంగ్ ఓపెన్ :సెప్టెంబర్ 12-17
వియత్నాం ఓపెన్ :సెప్టెంబర్ 12-17
డెన్మార్క్ ఓపెన్ సెప్టెంబర్ 17-22