Anrich Nortje : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జేకు అనూహ్య సంఘటన ఎదురైంది. బ్రేక్ సమయంలో అతడిని వెనకాల నుంచి స్పైడర్ కెమెరా ఢీ కొట్టింది. బ్యాక్వార్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ పొజిషన్‌కు అన్రిచ్ వెళ్తున్నాడు. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక స్పైడర్ కెమెరా అతడిని బలంగా ఢీ కొట్టింది. దాంతో, అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న అన్రిచ్ నేల మీద అలానే ఉండిపోయాడు. అతడు పడిపోడం చూసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పరుగున వచ్చారు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా వచ్చి అన్రిచ్ పరిస్థితి తెలుసుకున్నాడు. అయితే.. అదృష్టవశాత్తు అతనికి పెద్దగా గాయాలు కాలేదు. స్పైడర్ కెమెరా అన్రిచ్ను ఢీ కొట్టిన వీడియోను ఒక యూజర్ ట్విట్టర్లో పెట్టాడు. ఇలాంటి కెమెరాలు ఉపయోగించకూడదని ఒక అభిమాని ట్వీట్ చేశాడు.
మైదానంలో 360 డిగ్రీ వ్యూ కోసం స్పైడర్ కెమెరాలను ఉపయోగిస్తారు. ఇవి ఫీల్డర్ల మీద నుంచి వెళ్తూ సమాచారాన్ని చేరవేస్తాయి. మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 189 రన్స్‌కే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో3 వికెట్ల నష్టానికి 386 రన్స్ చేసింది. వార్నర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అన్రిచ్ నోర్జే కీలకమైన స్టీవ్ స్మిత్ వికెట్ సాధించాడు.
Here’s the @FoxCricket Flying Fox / Spider Cam doing its bit to help the Aussie cricketers build a healthy lead against South Africa… 😬🎥 Hope the player it collided with (Nortje?) is okay! #AUSvSA pic.twitter.com/9cIcPS2AAq
— Ari (@arimansfield) December 27, 2022