బెంగళూరు : సౌత్‌జోన్, సెంట్రల్ జోన్ మధ్య దులీప్ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకు పరిమితమైన సౌత్‌జోన్..రెండో ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నది. ఓవర్‌నైట్ స్కోరు 129/2తో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌత్‌జోన్ 426 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రవిచంద్రన్ స్మరణ్(67), రికీ భుయ్(45) జట్టుకు మెరుగైన శుభారంభం అందించారు.
వీరిద్దరు సెంట్రల్ జోన్ బౌలింగ్ దాడిని నిలువరిస్తూ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. కెప్టెన్ అజారుద్దీన్(27), నిజార్(12) నిరాశపరిచినా.. అంకిత్‌శర్మ(99), సిద్ధార్థ్(84) అర్ధసెంచరీలతో సౌత్‌జోన్ భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కార్తీకేయ(4/110), సారాంశ్(3/130) రాణించారు.