ప్రిటోరియా: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దంచికొట్టే క్లాసెన్.. టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2019లో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేసిన 32 ఏండ్ల క్లాసెన్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 4 టెస్టుల్లో 104 పరుగులు చేశాడు. వన్డే, టీ20లపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లాసెన్ సోమవారం వెల్లడించాడు.