హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ దళాన్ని మరింత పదును పెంచుకునే ప్రయత్నంలో పడింది. కాలి మడమ గాయంతో లీగ్‌కు పూర్తిగా దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన స్పీడ్‌స్టర్ గెరాల్డ్ కొట్జెను కొత్తగా జట్టులోకి తీసుకుంది.
చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే)తో మ్యాచ్ ముందు ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కనీస ధర రూ.2 కోట్లకు కొట్జెను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.