అబుదాబి: క్రికెట్ గ్రౌండ్లో మరో ప్లేయర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ మరో ప్లేయర్‌ను ఢీకొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెస్సిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ తరఫున ఆడుతున్న డుప్లెస్సి.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెషావర్ జాల్మీ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ లాంగాన్ బౌండరీ వైపు దూసుకెళ్లగా డుప్లెస్సి డైవ్ చేశాడు. అదే సమయంలో లాంగాఫ్ నుంచి మరో ప్లేయర్ మహ్మద్ హస్నైన్ దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అతని మోకాలు డుప్లెస్సి తలకు బలంగా తగిలింది. దీంతో అతడు కుప్పకూలాడు.
ఆ వెంటనే మైదానం నుంచి వెళ్లిపోయిన అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు టీమ్ వెల్లడించింది. అక్కడ అతనికి వివిధ స్కాన్లు నిర్వహించారు. డుప్లెస్సి తర్వాత మ్యాచ్ ఆడలేదు. దీంతో క్వెట్టా గ్లాడియేటర్స్ 198 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరో స్టార్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ కూడా లేకపోవడం క్వెట్టా టీమ్‌ను దెబ్బతీసింది.
Get well soon @faf1307#FafduPlessis pic.twitter.com/WRfX8N6xQ7
— ABHIJEET MONDAL (@abhijeet_234) June 13, 2021