జోహన్నస్బర్గ్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్.. సోమవారం ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు.
సఫారీ జట్టు పాకిస్థాన్ పర్యటనకు రానుండగా వన్డే, టీ20 జట్లలో డికాక్ సభ్యుడిగా ఉన్నాడు.