NZW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో బోణీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా (South Africa)కు సూపర్ ఛాన్స్ దొరికింది. బలమైన న్యూజిలాండ్(Newzealand)ను సఫారీ టీమ్ 250లోపే కట్టడి చేసింది. కెప్టెన్ సోఫీ డెవినె (85), బ్రూక్ హల్లిడే (38 నాటౌట్) జోరుతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్ ఆఖర్లో తడబడింది. డెవెనెను బౌల్డ్ చేసిన మలబా విజృంభణతో కివీస్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వారు ఎవరూ క్రీజులో నిలవలేకపోవడంతో 11 పరుగుల వ్యవధిలోనే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది వైట్ ఫెర్న్స్. కొండంత స్కోర్ కొడుతుందనుకున్న జట్టు అనూహ్యంగా 231కే ఆలౌటయ్యింది.
వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో కంగుతిన్న న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. ఇండోర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశగా సాగిన కివీస్ అనూహ్యంగా కుప్పకూలింది. కెప్టెన్ సోఫీ డెవినె (85) హాఫ్ సెంచరీతో, బ్రూక్ హల్లిడే(45) కీలక ఇన్నింగ్స్‌తో రాణించినా టెయిలెండర్ల వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.
An incredible display with the ball in hand from Nonkululeko Mlaba 👏
A brilliant performance that sets up the game for #TheProteas Women. 🇿🇦#Unbreakable #CWC25 pic.twitter.com/i7IzdwNCF4
— Proteas Women (@ProteasWomenCSA) October 6, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు మొదటి ఓవర్లోనే పెద్ద షాకిచ్చింది మరనే కాప్. ఓపెనర్ సుజీ బేట్స్ (0)ను గోల్డెన్ డక్‌గా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. ఆ తర్వాత జార్జియా పిమ్మర్(31), ఆల్‌రౌండర్ అమేలియా కేర్(23)లు ఆచితూడి ఆడి.. రెండో వికెట్‌కు 44 రన్స్ జోడించారు. దాంతో.. కివీస్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. కానీ..పవర్ ప్లే తర్వాత చొలే ట్రయాన్ బౌలింగ్‌లో అమేలియా ఔట్ అయింది. అనంతరం పిమ్మర్, కెప్టెన్ సోఫీ డెవినె(85) దూకుడుగా ఆడి జట్టు స్కోర్ సెంచరీ దాటించారు.
కాసేపటికే పిమ్మర్ వెనుదిరిగిన బ్రూక్ హల్లిడే(45) సాయంతో డెవినె చెలరేగింది. బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఇరువు దక్షిణాఫ్రికాపై విలువైన రన్స్ సాధించారు. దాంతో.. 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 164 చేసిన వైట్ ఫెర్న్స్ అలవోకగా 270 మార్క్ అందుకుంటుందనిపించింది.
డెవినె, హల్లిడేల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న న్యూజిలాండ్‌ను మలబా దెబ్బకొట్టింది. మరినే కాప్ ఓవర్లో ఆమె సూపర్ త్రోతో హల్లిడేను రనౌట్ చేసింది. అప్పటివరకూ 187/3తో పటిష్ట స్థితిలో ఉన్న న్యూజిలాండ్ పతనం మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ డెవినెను క్లీన్ బౌల్డ్ చేసింది. అంతే.. అక్కడి నుంచి సఫారీల జోరు కొనసాగగా కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు డగౌట్ చేరారు. దాంతో.. పూర్తి ఓవర్లు ఆడకుండానే 47.5 ఓవర్లకే వైట్ ఫెర్న్స్ ఇన్నింగ్స్ ముగిసింది. డెవినె వికెట్‌తో పుంజుకున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థిని 231కే ఆలౌట్ చేసింది.
Proteas break the 86-run stand in Indore! 🇿🇦🤝
A much-needed breakthrough for Nonkululeko Mlaba, who dismisses Brooke Halliday for 45(37)! ⚡
🇳🇿 – 187/4 (38.1)#NZWvSAW #Indore #CWC25 #Sportskeeda pic.twitter.com/REC0HBfYxa
— Sportskeeda (@Sportskeeda) October 6, 2025