Dane van Niekerk : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం.. ఆ తర్వాత కొద్ది రోజులకే యూటర్న్ తీసుకుంటున్నారు కొందరు. దేశం కోసమని.. తొందరపడి రిటైర్మెంట్ ఇచ్చామని కారణాలు చెబుతూ మళ్లీ మైదానంలోకి దిగుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్‌వాన్ నీకెర్క్ (Dane van Niekerk) సైతం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈమధ్యే దేశవాళీ క్రికెట్‌తో పునరాగమనం చేసిన 32 ఏళ్లున్న నీకెర్క్ వరల్డ్ కప్ సన్నాహక క్యాంప్‌లో చోటు దక్కించుకుందీ ఆల్‌రౌండర్.
రెండేళ్ల క్రితం నీకెర్క్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు లభించలేదనే కోపంతో ఆటకు అల్విదా చెప్పేసిందామె. అయితే.. ఫిట్నెస్ నిరూపించుకోలేకనే ఆమె ఎంపికవ్వలేదు. ఈ విషయాన్ని అంగీకరించిన నీకెర్క్ ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ యూటర్స్ తీసుకొంది. ‘వీడ్కోలు వెనక్కి తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తూ వస్తూనే వరల్డ్ కప్ సన్నద్ధత శిబిరంలో చోటు దక్కించుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతగా మిస్ అయ్యానో నాకు కాలం గుర్తు చేసింది. అవకాశం రావాలేగానీ మరోసారి దక్షిణాఫ్రికా జెర్సీతో చెలరేగి ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని నీకెర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.
An extended Proteas Women squad has assembled for a national training camp in Durban from 25 August – 01 September in preparation for the upcoming Pakistan tour and the ICC Women’s Cricket World Cup 2025 held in India and Sri Lanka.
Following the camp, the team will travel to… pic.twitter.com/Vjw3nYdVFl
— Proteas Women (@ProteasWomenCSA) August 25, 2025
ఇప్పటివరకూ ఈమె సఫారీ టీమ్ తరఫున194 మ్యాచులు ఆడింది. 107 వన్డేలు, 86 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడిన ఈ ఆల్‌రౌండర్ మూడు ఫార్మట్లలో కలిసి 204 వికెట్లు పడగొట్టింది. నీకెర్క్ సారథ్యంలో 50 వన్డేలు, 30 టీ20లు ఆడిన దక్షిణాఫ్రికా 29 వన్డేల్లో, 15 పొట్టి క్రికెట్ మ్యాచుల్లో గెలుపొందింది.
వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఎంపిక చేసిన 20 మంది బృందంలో నీకెర్క్ ఒకరు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1వ తేదీవరకూ డర్బన్ వేదికగా జరుగబోయే ఈ సన్నాహక శిబిరంలో ఆమె పాల్గొననుంది. ఈ క్యాంప్ తర్వాత పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది దక్షిణాఫ్రికా. దాంతో, ఫామ్ చాటుకొని.. ఫిటెనెస్ నిరూపించుకొని సెలెక్టర్ల దృష్టిలో పడాలనుకుంటుందీ మాజీ కెప్టెన్. ఒకవేళ పాక్ పర్యటనకు ఎంపికైతే.. వరల్డ్ కప్ స్క్వాడ్‌లోనూ నీకెర్క్ ఉండే అవకాశముంది.
దక్షిణాఫ్రికా మహిళల ట్రైనింగ్ స్క్వాడ్ : అన్నెకె బాస్చ్, తంజిమ్ బ్రిట్స్, నడినె డి క్లెర్క్, అన్నెరీ డిర్క్‌సెన్, లారా గుడ్‌ఆల్, అయంద హ్లుబీ, సినాలో జఫ్తా, అయబొంగ ఖాక, మసబత క్లాస్, సునే లుస్, ఎలింజ్ మరీ మార్క్స్, కరబొ మెసో, నాన్కులెల్కో మలబా, సేశ్నీ నాయుడు, లుయంద జుజా, తుమి సెఖుఖునె, నాండుమిసో షంగసే, మియనే స్మిత్, ఫయే టన్నిక్లిఫె, డానే వాన్ నీకెర్క్.