సెంచూరియన్: దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డీకాక్ టెస్టు క్రికెట్కు స్వస్తి పలికాడు. గురువారం ఇండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత డీకాక్ ఈ ప్రకటన చేశారు. తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీకాక్ తెలిపాడు. 2014లో టెస్టు అరంగేట్రం చేశాడతను. ఇప్పటి వరకు టెస్టుల్లో 38.82 సగటుతో 3300 రన్స్ చేశాడు. డీకాక్ మొత్తం 54 మ్యాచుల్లో ఆరు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని భార్య సాషా త్వరలో బేబీకి జన్మనివ్వనున్నది. ఈ నేపథ్యంలో తాను కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపాడు. వన్డేలకు, టీ20లకు అందుబాటులో ఉండనున్నట్లు అతను చెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్కప్ సమయంలో.. మోకాలిపై కూర్చుని నివాళి అర్పించాలని బోర్డు కోరిగా ఆ మ్యాచ్కు డీకాక్ దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోర్డుకు అతను క్షమాపణలు చెప్పాడు.