హైదరాబాద్, ఆట ప్రతినిధి: చైనీస్ తైపీ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-15 సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టుకు రాష్ర్టానికి చెందిన సౌమ్యరాణి కెప్టెన్గా వ్యవహరించనుంది. ప్రస్తుతం తాడ్వాయ్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న సౌమ్య..
సాఫ్ట్బాల్లో నిలకడగా రాణిస్తున్నది. కోచ్ మౌనిక శిక్షణలో రాటుదేలుతున్నది. ఆసియా టోర్నీలో సౌమ్య సహా తెలంగాణ నుంచి ఏడుగురు భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. వీరిలో సాత్విక, సౌందర్య, సరయు, కార్తీక, స్రావిక, వినయ్ ఉన్నారు.