Sophie Devine : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ (Newzealand) ప్రయాణం ముగిసింది. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగపెట్టిన వైట్ ఫెర్న్స్ లీగ్ దశలో ఓటమితో ఇంటిదారి పట్టింది. టీమిండియా చేతిలో ఓడిన తర్వాత సెమీస్ చేరలేకపోయామనే బాధ ఆ జట్టు సభ్యుల్లో స్పష్టంగా కనిపించింది. కానీ, ఆదివారం ఇంగ్లండ్ దెబ్బకు ఆ జట్టుకు దారుణ పరాజయం ఎదురైంది. కానీ, అంతకంటే మరొక విషయం కివీస్ క్రికెటర్లను ఎంతగానో బాధిస్తోంది. అదేంటంటే.. ఇన్నాళ్లు తమను నడిపించిన.. పెద్దక్కలా వ్యవహరిస్తూ వచ్చిన కెప్టె్న్ సోఫీ డెవెనె (Sophie Devine) కెరీర్ ముగించనుంది.
ప్రపంచకప్ ఆరంభానికి ముందే దేశం తరఫున నేను ఆడబోయే చివరి టోర్నీ ఇదే అని ఈ ఆల్‌రౌండర్ వెల్లడించింది. నిరుడు న్యూజిలాండ్‌ను తొలిసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ఆమె వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడాలనుకుంది. కానీ, అమె ఈసారి టీమ్‌తో అద్భుతం చేయలేకపోయింది. ఫలితంగా.. ఏడు మ్యాచుల్లో ఒకేఒక విజయంతో సెమీస్ అవకాశం చేజార్చుకుంది.
It’s already an emotional day for New Zealand cricket, as Sophie Devine herself said 🥺
A 19-year-old legendary WODI career is coming to an end 💔#CricketWorldCup | #fblifestyle pic.twitter.com/MKRA4fc0H2
— Cricketangon (@cricketangon) October 26, 2025
చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సంతృప్తిగా స్వదేశం వెళ్దామనుకుంటే.. ఇంగ్లండ్ స్పిన్నర్లు ముప్పతిప్పలు పెట్టి.. ఘోర పరాభవాన్ని అందించారు. వైజాగ్‌లో ఓటమితో అంతర్జాతీయంగా వన్డేల్లో డెవెనె ప్రస్థానం ముగిసిపోయింది. ఇక కివీస్ లెజెండ్ తానే స్వయంగా నేను వీడ్కోలు పలికాను అని మరో ప్రకటన చేయడమే తరువాయి. అందుకే.. మ్యాచ్ ముగియగానే ఇంగ్లండ్ క్రికెటర్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ (Gaurd Of Honour)తో డెవెనెకు వీడ్కోలు పలికారు. ఇరుజట్ల క్రికెటర్లు. ఇరువైపులా నిలబడి.. చప్పట్లు కొట్టారు. ఆలింగనం చేసుకొని.. సుదీర్ఘ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు తెలిపారు.
క్రికెట్‌కు ఏమంత ఆదరణ లేని న్యూజిలాండ్‌లో యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది సోఫీ డెవెనె. 2006 అక్టోబర్ 22న తొలి వన్డే ఆడిన ఆమె.. అనతికాలంలోనే జట్టులో కీలకమైంది. పేస్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ.. ఓపెనర్‌గా శుభారంభాలు ఇస్తూ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమైంది డెవెనె. 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 159 వన్డేలు ఆడిన తను.. 9 శతకాలు, 18 హాఫ్ సెంచరీలతో కలిపి 4,279 పరుగుల చేసింది. బంతితోనూ సత్తా చాటి 111 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.. 3/24.
Sophie Devine leads New Zealand for the last time in an ODI 🥹
Follow live ➡️ https://t.co/kh3cYXJO2X#CWC25 pic.twitter.com/rvkybHFAzx
— ICC (@ICC) October 26, 2025