RCB vs GG : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ సోఫీ డెవినే ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. విధ్వంసక బ్యాటింగ్ చేసిన ఆమె 99 రన్స్ వద్ద ఔటయ్యింది. అంతేకాదు డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 36 బంతుల్లో9 ఫోర్లు, 8 సిక్స్‌లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. సిక్స్‌లు, ఫోర్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకు పడిన ఆమె దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. అలీసా పెర్రీ (12), హీథర్ నైట్ (9) క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 21 పరుగులు కావాలి. 125 రన్స్ వద్ద మంధాన (37) ఔటయ్యింది.