RCB vs GG : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ సోఫీ డెవినే(78) హాఫ్ సెంచరీ కొట్టింది. హర్లీన్ వేసిన ఏడో ఓవర్లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. 20 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో యాభైకి చేరుకుంది. డబ్ల్యూపీఎల్‌లో మూడో వేగవంతమైన ఫిఫ్టీ బాదింది. స్మృతి మంధాన(37)తో కలిసి తొలి వికెట్‌కు 100 రన్స్ జోడించింది. తొమ్మిది ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 125 రన్స్ చేసిం
189 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో స్మృతి మంధాన , సోఫీ డెవినే దంచి కొట్టడంతో ఆరు ఓవర్లలో 77 పరుగులు వచ్చాయి. అష్ గార్డ్నర్ వేసిన రెండో ఓవర్లో సోఫీ డెవినే చెలరేగింది. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదింది. దాంతో, ఏకంగా 24 రన్స్ వచ్చాయి. అక్కడితో మొదలు ప్రతి ఓవర్లో బౌండరీ, సిక్స్‌తో మంధాన, డెవినే స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) 188 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్ లారా వొల్వార్డ్ (68) హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. గత మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన అష్ గార్డ్నర్(41) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో హర్లీన్ డియోల్ (12), దయలాన్ హేమలత (16)రెచ్చిపోయి ఆడారు.