Anil Kumble: క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టిస్తాడు.. వైభవ్ సూర్యవంశీపై కుంబ్లే ప్రశంసలు
Anil Kumble: వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసే సత్తా వైభవ్‌కు ఉన్నట్లు చెప్పారు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు గేల్ పేరిట ఉన్నది. దాన్ని వైభవ్ బ్రేక్ చేస్తాడని కుంబ్లే అన్నారు.
న్యూఢిల్లీ: టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై.. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) ప్రశంసలు కురిపించారు. విండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసే సత్తా వైభవ్‌కు ఉన్నట్లు చెప్పారు. సూర్యవంశీ తన బ్యాటింగ్ శైలితో ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. ఐపీఎల్లో ఓ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్నది. అయితే ఆ రికార్డును సూర్యవంశీ అధిగమిస్తాడని కుంబ్లే అభిప్రాయపడుతున్నారు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్లో సూర్యవంశీ 53 సిక్సర్లు బాదాడు. అయితే గతంలో క్రిస్ గేల్ ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 59 సిక్సర్లు బాదాడు. ఇక ఆ సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసే అవకాశం సూర్యవంశీకి ఉన్నట్లు కుంబ్లే పేర్కొన్నారు. ఆర్ఆర్ జట్టుకు లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడనున్నది, ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే, అప్పుడు గేల్ రికార్డును కచ్చితంగా సూర్యవంశీ బ్రేక్ చేస్తాడని కుంబ్లే అన్నారు.
వైభవ్‌కు సిక్సర్లు కొట్టే సత్తా ఉందని, అతను కవర్ మీదుగా చాలా ఈజీగా సిక్సర్ కొడుతున్నాడని, దిగ్వేశ్ రాథీ బౌలింగ్‌లో పలుమార్లు ఆ షాట్ ఆడాడనని, ఆ ట్యాలెంట్‌ను పొగిడేందుకు తనకు మాటలు రావడం లేదని కుంబ్లే అన్నారు. చాలా స్పెషల్ ట్యాలెంట్ ఉందని చెప్పారు. అతని మైండ్‌సెట్ కూడా చాలా భిన్నంగా ఉందని, మాట్లాడిన ప్రతిసారీ చాలా పరిపక్వతతో మాట్లాడినట్లుగా ఉంటుందన్నారు. చిన్న వయసులోనే అతను పెద్ద స్టార్ అయిపోయాడని, కానీ చాలా ఒదిగా ఉంటున్నాడని, అంటే చాలా సుదీర్ఘమైన కెరీర్‌కు అతను సిద్దమైనట్లు తెలుస్తోందని కుంబ్లే అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

