యుపియా(అరుణాచల్‌ప్రదేశ్): సాఫ్ అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఆతిథ్య భారత్, బంగ్లాదేశ్ టైటిల్ ఫైట్‌లో తలపడనున్నాయి. టోర్నీలో అపజయమెరుగని యువ భారత్ గ్రూపు దశలో శ్రీలంకపై 8-0తో, నేపాల్‌పై 4-0తో, సెమీస్‌లో మాల్దీవులపై 3-0తో గెలిచి మంచి జోరుమీదుంది. మరోవైపు బంగ్లా కూడా దూకుడు మీద కనిపిస్తున్నది.
మాల్దీవులతో మ్యాచ్ డ్రా చేసుకున్న బంగ్లా..భూటాన్‌పై 3-0తో, నేపాల్ 2-1తో గెలిచింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెలిస్తే భారత్ ఖాతాలో 10వ సాఫ్ టైటిల్ చేరుతుంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు సాఫ్ వేర్వేరు వయసు విభాగాల ఫైనల్లో బంగ్లాతో తలపడిన భారత్ అన్నింటిలో విజయం సాధించడం విశేషం.