Simone Biles | పారిస్: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. పారిస్ ఒలింపిక్స్లో పసిడి పతకాల పంట పండిస్తున్నది. తాను అడుగుపెట్టనంత వరకే ఒక్కసారి పోటీకి దిగితే పసిడి పక్కా అన్న రీతిలో దూసుకెళుతున్నది. ఇప్పటికే వేర్వేరు విభాగాల్లో రెండు స్వర్ణాలు సొంతం చేసుకున్న బైల్స్..శనివారం జరిగిన మహిళల వాల్ట్ కేటగిరీలో మరో గోల్డ్ ఖాతాలో వేసుకుంది. దీంతో పారిస్లో బైల్స్ స్వర్ణాల సంఖ్య మూడుకు చేరుకుంది.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వాల్ట్ పోటీలో బైల్స్ 15.300 స్కోరుతో ఈ అమెరికా సంచలనం టాప్లో నిలువగా, అండ్రెడ్ (14.966, బ్రెజిల్), క్యారె (14.466) వరుసగా రజత, కాం స్య పతకాలు సొంతం చేసుకున్నా రు. ఇప్పటి వరకు మూడు ఒలింపిక్స్లో ఏడు స్వర్ణాలు సాధించిన తొలి జిమ్నాస్ట్గా బైల్స్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.