లండన్: డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్‌పై నాలుగేండ్ల నిషేధం పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హలెప్‌ను సస్పెండ్ చేస్తూ అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన హలెప్..రెండు రకాల డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది.
2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో పాటు అథ్లెట్ బయోలాజికల్ పాస్‌పోర్ట్ విషయంలోనూ హలెప్ నిబంధనలు అతిక్రమించినట్లు ఐటీఐఏ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా హలెప్ డోపింగ్‌కు పాల్పడినట్లు ప్యానెల్ తుది నిర్ణయాని వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రొమేనియా ప్లేయర్‌పై విధించిన నిషేధం అక్టోబర్ 2022 నుంచి అక్టోబర్ 6, 2026 వరకు కొనసాగనుంది. 2017లో తొలిసారి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ చేరుకున్న హలెప్..2019లో సెరెనా విలియమ్స్‌పై గెలిచి వింబుల్డన్ విజేతగా నిలిచింది.