సొలో: ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు తన్వి శర్మ, వెన్నెల కలగోట్ల అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రెండో సీడ్ తన్వి 21-19, 21-14తో థలిత రమధాని(ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది.
35 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తన్వి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మరో క్వార్టర్స్‌లో తెలుగు షట్లర్ వెన్నెల 21-18, 17-21, 21-17తో జన్యపార్న్ మీపాన్థోంగ్(థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో వెన్నెల సూపర్ స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్‌తో ఆకట్టుకుంది.