బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి తొలి విఘ్నాన్ని అధిగమించి ప్రిక్వార్టర్స్ చేరాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తరుణ్.. 22-20, 21-17తో వాంగ్చారొయెన్ (థాయ్‌లాండ్)పై గెలిచి రెండో రౌండ్‌కు ప్రవేశించాడు. సీనియర్ షట్లర్ కిరణ్ జార్జి.. 21-15, 21-9తో ఐదిల్ షొలె (మలేషియా)పై అలవోక విజయం సాధించాడు. యువ షట్లర్ మంజునాథ్.. 21-12, 9-21, 21-17తో జొహన్సెన్ (డెన్మార్క్)పై గెలిచాడు. కానీ ప్రియాన్షు రజావత్, సుబ్రహ్మణ్యన్‌కు ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో మరో హైదరాబాదీ అమ్మాయి శ్రీయాన్షి.. 14-21, 21-13, 21-19తో వెన్ యు ఝాంగ్ (కెనడా)ను చిత్తుచేసింది. అన్మోల్ ఖార్బ్.. 21-12, 21-12తో లొ సిన్ యాన్ (హాంకాంగ్)ను మట్టికరిపించింది. మాళవికను భారత్‌కే చెందిన ఇషారాణి ఓడించగా అష్మితపై దేవిక పైచేయి సాధించింది. అనుపమ ఉపాధ్యాయ, తస్మిన్ మిర్, ఆకర్షి కశ్యప్ సైతం తొలి రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.