Shumban Gill : తొలి టెస్టులో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shumban Gill) కోలుకుంటున్నాడు. మెడకు బంతి తాకడంతో శనివారం ఆస్పత్రిలో చేరిన గిల్.. ఆదివారం డిశ్చార్జ్ అయ్యాడు. హాస్పిటల్ నుంచి నేరుగా టీమ్ హోటల్ చేరుకున్నాడు టీమిండియా సారథి. అయితే.. అతడికి వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి సూచించారు. దాంతో.. సిరీస్‌లో కీలకమైన రెండో టెస్టుకు గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఈడెన్ గార్డెన్స్‌లో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్ తప్పేలా లేదు. రిటైర్డ్ హర్ట్ అయిన సారథి శుభ్‌మన్ గిల్ గువాహటి టెస్టులోఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. మెడనొప్పితో ఆస్పత్రిలో చేరిన గిల్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు మెడను ఈజీగా అటూఇటూ కదిలించగలుగుతున్నాడు. అయితే.. వెంటనే అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు దిగకపోవచ్చు. టీమ్ హోటల్ చేరుకున్న గిల్‌ను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఒకవేళ గిల్ రెండో టెస్టులోపు ఫిట్‌గా లేకుంటే.. రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది.
Shubman Gill retires hurt due to Periods. pic.twitter.com/Vo9w8OwDBR
— Aayesha (@Aayshaforyou) November 15, 2025
తొలి టెస్టు రెండోరోజు వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్ నాలుగు పరుగుల వద్ద స్వీప్ షాట్ ఆడబోయాడు. కానీ, సిమన్ హార్మర్ సంధించిన బంతిని అంచనా వేయలేకపోయాడు. షాట్ మిస్ కావడంతో బంతి గిల్ అతడి మెడకు గట్టిగా తాకింది. ఫిజియో వచ్చి పరీక్షించినా నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మొదట డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి వైద్యం అందించారు. కానీ, సాయంత్ర కూడా టీమిండియా సారథి అసౌకర్యంగా కనిపించాడు. దాంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రాకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. సఫారీ స్పిన్నర్ హర్మర్(4-21) తిప్పేయగా 124 పరుగుల ఛేదనలో టీమిండియా 93కే ఆలౌటయ్యింది.