లీడ్స్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగవ రోజు ఆరంభంలోనే ఇండియాకు జలక్ తగిలింది. తొలి సెషన్ తొలి ఓవర్లోనే కీలకమైన కెప్టెన్ శుభమన్ గిల్(Shubhman Gill) వికెట్‌ను కోల్పోయింది. నిన్నటి స్కోర్‌కు మరో రెండు పరుగులు జోడించిన గిల్.. కార్సే బౌలింగ్‌లో వ్యక్తిగతంగా 8 పరుగులు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రాహుల్, పంత్ ఉన్నారు. ఇండియా ఆధిక్యం వంద రన్స్ దాటింది.
1ST Test. WICKET! 24.6: Shubman Gill 8(16) b Brydon Carse, India 92/3 https://t.co/ExbRAWMM3Z #ENGvIND #1stTEST
— BCCI (@BCCI) June 23, 2025
ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 471 రన్స్ చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 రన్స్‌కు ఆలౌటైంది. భారత బౌలర్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అతనికి ఇది 14వసారి.