హైదరాబాద్, ఆట ప్రతినిధి: బౌల్డర్‌హిల్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నీలో శుభాంకర్శర్మ టైటిల్ విజేతగా నిలిచాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన టోర్నీలో ఐదు అండర్-67 స్కోరుతో శుభాంకర్ ఏడవ డీపీ వరల్డ్ పీజీటీఐ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన శుభాంకర్ రికార్డు స్థాయిలో 25 అండర్ 263(66-66-64-67) స్కోరుతో ముగించాడు. ప్రత్యర్థుల కంటే ఎనిమిది షాట్ల భారీ ఆధిక్యంలో నిలిచిన అతను పీజీటీఐలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
టైటిల్ విజేతగా 29 ఏండ్ల శుభాంకర్‌కు రూ.15 లక్షల నగదు బహుమతి దక్కింది. మరోవైపు హైదరాబాద్ గోల్ఫర్ మహమ్మద్ అజర్(271), రషీద్‌ఖాన్(271), అంగద్చీమా(271) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పీజీటీఏలో ఐదు సార్లు చాంపియన్ అజితేశ్ సంధు 272 స్కోరుతో ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ముగింపు కార్యక్రమంలో టీగోల్ఫ్ సీఈవో ఎన్ఆర్ఎన్ రెడ్డి, ఎమ్మార్ ప్రాపర్టీస్ సీఎఫ్‌వో మదుసూధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.