హైదరాబాద్, ఆట ప్రతినిధి: అక్లాండ్(న్యూజిలాండ్) వేదికగా జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన శృతి, సాగర్ విజయ్ పసిడి పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 76కిలోల సబ్‌జూనియర్ విభాగంలో పోటీకి దిగిన శృతి..స్కాట్‌లో 130కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 135కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 205కిలోలు మొత్తంగా 470కిలోలతో స్వర్ణం దక్కించుకుంది.
ఆస్ట్రేలియా, గయానా లిఫ్టర్లు వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 120కిలోల జూనియర్ విభాగంలో సాగర్ విజయ్ స్కాట్‌లో 260కి, బెంచ్‌ప్రెస్‌లో 142 కి. డెడ్‌లిఫ్ట్‌లో 210కి, మొత్తంగా 612కి.తో పసిడి సొంతం చేసుకున్నాడు. హిల్స్ ఆరోన్(590కి), సాండర్స్ ఫ్రాన్సిస్ (570కి) వరుసగా రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.