న్యూఢిల్లీ : బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా) వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. శుక్రవారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్ విభాగంలో భారత యువ షూటర్ చైన్‌సింగ్(443.7) కాంస్య పతకంతో మెరిశాడు. ఇస్టాన్ పెని(461.0), తియాన్ జియిమింగ్ (458.8) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. గత మూడేండ్ల వ్యవధిలో చైన్‌కు ఇది తొలి పతకం.