ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మంగళశారం నుంచి మొదలైన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్-2024లో భారత్ తొలిరోజే ఖాతా తెరిచింది. యువ షూటర్ సోనమ్ మస్కర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది.
ఫైనల్లో ఆమె 252.9 పాయింట్లు స్కోరు చేసింది. 254.5 పాయింట్లు సాధించిన చైనా షూటర్ యుటింగ్ హువాంగ్‌కు స్వర్ణం దక్కగా ఫ్రెంచ్ అమ్మాయి ఒలియాన్నె ముల్లర్ (231.1) కాంస్యం నెగ్గింది. ఈ టోర్నీ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో బరిలోకి దిగిన రిథమ్ సంగ్వాన్, పురుషుల విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్లో పతకం తేవడంలో విఫలమయ్యారు.