IPL 2023 : సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. దాంతో, పంజాబ్ కింగ్స్‌ను 143 పరుగులకు కట్టడి చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగాడు. దాంతో, పోరాడగలిగే స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.
తొలి బంతికి ప్రభుసిమ్రాన్ సింగ్(0)ను ఔట్ చేశాడు. ఆ జాన్సేన్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూ షార్ట్(1) ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో, 10 పరుగుల వద్ద ఆ జట్టు రెండో వికెట్ పడింది. మార్కో జాన్సేన్ మరోసారి చెలరేగాడు. జితేశ్ శర్మ(4)ను ఔట్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
A captain’s performance of 9⃣9⃣* from @SDhawan25 as he helped @PunjabKingsIPL team to a fighting total 🙌 🙌
He becomes our 🔝 performer from the first innings of the #SRHvPBKS clash in the #TATAIPL
A look at his batting summary 🔽 pic.twitter.com/uOaUDX8QGk
— IndianPremierLeague (@IPL) April 9, 2023
ఒక దశలో ఆ జట్టు 100 రన్స్ చేయడమే కష్టం అనిపించింది. కానీ, కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగాడు. సామ్ కరన్(22)తో కలిసి 41 రన్స్ జోడించాడు. నటరాజన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో యాభై రన్స్ చేశాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. 88 పరుగులకే 9 వికెట్లు పడిన పంజాబ్ 143 రన్స్ చేసిందంటే అదంతా ధావన్ చలవే. ఉమ్రాన్, భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడిన అతను స్కోర్ 140 దాటించాడు. మోహిత్ రథీ(1)తో కలిసి ఆఖరి వికెట్‌కు 55 రన్స్ జోడించాడు.