ముంబై: ఆ మధ్య గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌పై ఆ టీమ్ ఓనర్ షారుక్‌ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలుసు కదా. అభిమానులకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆ తర్వాత కూడా నైట్‌రైడర్స్ ఆటలో పెద్దగా మార్పేమీ లేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. టాపార్డర్ కుప్పకూలడంతో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన నైట్‌రైడర్స్‌ను దాదాపు గెలిపించినంత పని చేశారు రసెల్, కార్తీక్, కమిన్స్.
తాజాగా ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత షారుక్ ఖాన్ ట్వీట్ చేశాడు. కుడా.. వుడా.. షుడా అంటూ గెలిచి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయినా మ్యాచ్‌లో అసాధారణ పోరాటం చేసిన ఈ ముగ్గురిపై ప్రశంసలు కురిపించాడు. నైట్‌రైడర్స్ అద్భుతంగా ఆడారు. (బ్యాటింగ్ పవర్ ప్లే మరచిపోతే!).. రసెల్, కమిన్స్, కార్తీక్ అద్భుతంగా ఆడారు. దీన్నే అలవాటుగా మార్చుకోండి అని షారుక్ ట్వీట్ చేశాడు.
Coulda…woulda…shoulda can take a backseat tonight…@KKRiders was quite awesome I feel. ( oops if we can forget the batting power play!!) well done boys…@Russell12A @patcummins30 @DineshKarthik try and make this a habit…we will be back!! pic.twitter.com/B1wGBe14n3
— Shah Rukh Khan (@iamsrk) April 21, 2021