ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేజేతులా ఓడటంపై ఆ టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్వీట్ చేసిన కింగ్ ఖాన్.. నేరుగానే తన అసంతృప్తిని వెల్లగక్కాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ అభిమానులకు అతడు క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. తీవ్ర నిరాశ కలిగించే ప్రదర్శన ఇది. అభిమానులు అందరికీ క్షమాపణలు అని షారుక్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో మొదట ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేసి, తర్వాత చేజింగ్‌లోనూ అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న నైట్‌రైడర్స్.. చెత్త షాట్లతో వికెట్లు పారేసుకొని ఓటమి కొనితెచ్చుకున్నారు. చివర్లో రసెల్, కార్తీక్‌లాంటి వాళ్లు క్రీజులో ఉన్నా.. బుమ్రా, బౌల్ట్ బౌలింగ్ ధాటికి వాళ్లు ఏమీ చేయలేకపోయారు. చివరికి 10 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌కు ఓటమి తప్పలేదు.
Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021
ఇవి కూడా చదవండి
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్‌తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి