టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను అతడి అభిమానులతో పాటు జట్టులోని సహచరులు కూడా ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుస్తారు. ఠాకూర్ ఏదైనా మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తే ఇక అతడి నిక్ నేమ్ మీద సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా అతడి నిక్ నేమ్స్ తో పాటు ఇంగ్లండ్ తో ఐదో టెస్టులో తన ప్రణాళికలను వివరించాడు ఠాకూర్.
బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో శార్దూల్ మాట్లాడుతూ.. ‘నా టీమ్ మేట్స్, అభిమానులు నన్ను ఏ పేరుతో పిలిచినా నాకు సంతోషమే. రంజీలు ఆడుతున్నప్పుడు నా సహచరులంతా నన్ను బుల్ అని పిలిచేవాళ్లు. ఇక లార్డ్, బీఫీ పేర్లు ఇంగ్లాండ్ తో నేను మెరుగైన ప్రదర్శనలు చేయడం వల్ల ఫేమస్ అవడంతో వచ్చాయి. నా టీమ్ మేట్స్ ఆ పేరుతో నన్ను పిలిస్తే నా మీద వారికి ఎంత ప్రేముందో అర్థమవుతుంది. అదీగాక ఆ పేర్లు వినడానికి కూడా బాగున్నాయి..’ అని అన్నాడు.
గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా ఆడిన ఠాకూర్.. రెండు టెస్టులలో 7 వికెట్లు తీసి బ్యాటర్ గా కూడా 117 పరుగులు చేశాడు. అప్పట్నుంచి ఠాకూర్ టెస్టులలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఇక ఇంగ్లండ్ లో బౌలింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని, ఇక్కడి పిచ్ లు బౌలర్లకు అండగా నిలుస్తాయని శార్దూల్ చెప్పాడు. ‘ఇంగ్లండ్ బౌలర్లకు స్వర్గధామం. ఇక్కడ బంతి బాగా స్వింగ్ అవుతుంది. ఒకే స్పెల్ లో మీరు ఎక్కువ వికెట్లు పడగొట్టొచ్చు. ఇక్కడ క్రికెట్ ఆడటం నాకు చాలా ఇష్టం..’ అని చెప్పుకొచ్చాడు.
From fond memories of playing in England to the funniest nicknames given to him by his teammates. 👍👍 @imShard shares it all as #TeamIndia gears up for the rescheduled #ENGvIND Test at Edgbaston. 👌 👌
Full interview 🎥⬇️https://t.co/kewiZpN1Ax pic.twitter.com/pKpJtMEZFW
— BCCI (@BCCI) June 30, 2022