Suriya 50 | తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన.. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న సూర్య.. తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నింటికంటే ఇప్పుడు సినీ అభిమానుల దృష్టి సూర్య కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 50వ సినిమాపైనే ఉంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాలో పరిచయం చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్ రోలెక్స్‌ను హీరోగా పెట్టి ఓ పూర్తి స్థాయి సినిమా తెరకెక్కనుందనే ప్రచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై సూర్య స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాలో సూర్య కొద్దిసేపు మాత్రమే కనిపించారు. అయితే చివర్లో డ్రగ్ లార్డ్ రోలెక్స్‌గా ఆయన ఇచ్చిన ఎంట్రీ మాత్రం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.భయంకరమైన లుక్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్, క్రూరమైన నటనతో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా రోలెక్స్ పాత్రపై చర్చ కొనసాగింది. ఈ పాత్రను ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయి సినిమా రావాలని అప్పటి నుంచే అభిమానులు కోరుతున్నారు. లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో రోలెక్స్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది.
తాజాగా సూర్య ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ‘రోలెక్స్’ కథకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని వెల్లడించినట్లు సమాచారం.దీంతో ఇంతకాలం కేవలం ప్రచారంగా వినిపించిన ‘రోలెక్స్’ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు మరోసారి భారీ చర్చ మొదలైంది. లోకేష్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసి సూర్యకు వినిపించిన తర్వాతే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సూర్య కెరీర్లో 50వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందులోనూ ‘విక్రమ్’లో రోలెక్స్‌గా సూర్యకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. అదే పాత్రతో పూర్తి సినిమా వస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే సూర్య 50వ సినిమా ‘రోలెక్స్’గానే ఉంటుందని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. సూర్య స్వయంగా చెప్పిన వివరాల ప్రకారం లోకేష్ ఈ కథను సిద్ధం చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది.