పెబ్బేరు రూరల్: జాతీయ టార్గెట్బాల్ కెప్టెన్‌గా వనపర్తి జిల్లా వాసి ఎంపికయ్యాడు. టార్గెట్బాల్ పోటీల్లో వివిధ స్థాయిల్లో రాణిస్తున్న పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ఉమాశంకర్ జాతీయ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జూలై 13 నుంచి 17వ తేదీ వరకు ఢాకాలో జరుగబోయే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. కెప్టెన్‌గా శంకర్ ఎంపికపై రాష్ట్ర టార్గెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రేవంత్‌కుమార్, కోచ్ కమలాకర్, గ్రామస్తులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.