Shane Warne | ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ ఇక లేరు. 52 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో థాయిలాండ్‌లో మృతి చెందారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది. షేన్ వార్న్ ఆస్ట్రేలియా క్రికెట్ కోసం చేసిన సేవలను.. ఆయన రికార్డులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు షేన్ వార్న్ వీడ్కోలు పలికారు. 1992 నుంచి 2007 వరకు ఆసీస్ తరుపున వార్న్ ప్రాతినిధ్యం వహించారు. 1994లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా షేన్ వార్న్ ఎంపికయ్యారు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించారు.
టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, టెస్టుల్లో పది సార్లు 10 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు, 145 టెస్టుల్లో అత్యధిక వికెట్లు 708 తీసిన రెండో బౌలర్, టెస్టులు, వన్డేల్లో కలిపి 1001 వికెట్లు తీసిన రికార్డులు షేన్ వార్న్ సొంతం. షేన్ వార్న్.. 2021లో కరోనా బారిన పడి తర్వాత కోలుకున్నారు.