సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గాయపడ్డాడు. తన బైక్ నుంచి కింద పడ్డాడు. కుమారుడు జాక్సన్‌తో కలిసి బైక్ నడుపుతున్న సమయంలో వార్న్ రోడ్డుపై జారిపడ్డాడు. అయితే అతని బైక్ కనీసం 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ తీవ్ర నొప్పులతో వార్న్ బాధపడుతున్నాడు. కాలు, తొంటి ఎముకలు విరిగి ఉంటాయని తొలుత వార్న్ భయపడ్డాడు. కానీ హాస్పిటల్‌కు వెళ్లిను అతను క్షేమంగా ఉన్నట్లు తేలింది. 52 ఏళ్ల వార్న్ ఇప్పుడు కామెంటేటర్‌గా చేస్తున్నాడు. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌కు కామెంటరీ ఇవ్వనున్నాడు.