కరాచీ: పాకిస్థానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో షాన్ మసూద్(Shan Masood) రికార్డు క్రియేట్ చేశాడు. శరవేగంగా డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్గా ఘనత సాధించాడు. 177 బంతుల్లోనే అతను డబుల్ సెంచరీ చేశాడు. మూడు దశాబ్ధాల క్రితం ఇంజమాబుల్ హక్ పేరిట ఉన్న రికార్డును టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ బ్రేక్ చేశాడు. ప్రెసిడెంట్స్ కప్ డిపార్ట్మెంటల్ టోర్నీలో సూయి నార్తర్న్ గ్యాస్ జట్టు తరపున ఆడుతూ మసూద్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ 1992లో ఇంగ్లండ్ టూరు వెళ్లిన సమయంలో అక్కడ ఓ మ్యాచ్లో 188 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. అయితే పాకిస్థాన్లో డబుల్ సెంచరీ కొట్టిన విదేశీ క్రికెటర్ల జాబితాలో భారత బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు. 2006లో జరిగిన లాహోర్ టెస్టులో సెహ్వాగ్ 182 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.